ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:45 IST)

స్వీట్ కార్న్‌లో ఏమున్నాయో తెలుసా? (Video)

sweet corn
స్వీట్‌కార్న్‌... తీపి మొక్కజొన్నలో విటమిన్ బి, సీలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలో కంటే స్వీట్‌కార్న్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా, స్వీట్‌కార్న్‌లో 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్న స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 

 
మొక్కజొన్న గొప్ప పోషకాహారంతో నిండిన తృణధాన్యం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. మొక్కజొన్న అద్భుతమైన యాంటీకాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి వుంది.

 
ఇది అనేక వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. మొక్కజొన్న తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుంది. ఐతే అతిగా తింటే ఏదయినా సమస్యను తెస్తుంది. మొక్కజొన్న ఎక్కువగా తింటే, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, హేమోరాయిడ్లకు కారణం కావచ్చు. అందువల్ల మొక్కజొన్నను మితంగా తీసుకోవాలి.