గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (23:50 IST)

పెంపుడు జంతువులకు ఉల్లిపాయలు పెడితే అంతేసంగతులు... జాగ్రత్త

onion-dog
పెద్దఉల్లిపాయ మానవులకు ఎంతో మేలు చేస్తుంది. కానీ జంతువులకు మాత్రం ఇది వ్యతిరేకంగా పనిచేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఉల్లిపాయలు కుక్కలు, పిల్లులు, గుర్రాలు, కోతులతో సహా కొన్ని జంతువులకు అవి ప్రాణాంతకం అయ్యే అవకాశం వుంది.

 
ఉల్లిపాయల్లో వుండే సల్ఫాక్సైడ్లు, సల్ఫైడ్లు అనేవి జంతువుల్లో హీన్జ్ బాడీ అనీమియా అనే వ్యాధిని కలిగిస్తాయి. ఈ అనారోగ్యం కారణంగా జంతువుల ఎర్ర రక్త కణాలలో దెబ్బతినడం జరుగుతుంది. ఫలితంగా రక్తహీనతకు దారితీస్తుంది.

 
పెంపుడు జంతువుకు ఉల్లిపాయలు పెట్టకూడదని చెపుతున్నారు. ఇంట్లో ఏదైనా జంతువు ఉంటే ఉల్లిపాయలతో రుచిగా ఉండే వంటకాలను సైతం అందుబాటులో లేకుండా ఉంచాలని చెపుతున్నారు.