శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 జులై 2022 (15:31 IST)

ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుంది

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత వుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రతిరోజూ 50 గ్రాముల మేర పచ్చిఉల్లిపాయను తింటే మధుమేహం అదుపులో వుంటుందని పరిశోధనల్లో తేలింది.

 
50 గ్రాముల పెద్దఉల్లిపాయను తింటే అది 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానమని చెప్పారు. ఈ ఉల్లిపాయను రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి దరిచేరవని అంటున్నారు.


ఈ ఉల్లిపాయలను వారానికి ఒకటి నుండి ఏడింటిని తినడం వల్ల కొలొరెక్టల్, స్వరపేటిక, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల నోటి, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఉల్లిపాయలు తినడం ద్వారా జరిగే మంచి. ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

 
ఐతే ఇవే ఉల్లిపాయలు కొందరికి సరిపడవు. ఉల్లిపాయలను అధిక మోతాదులో తినడం వల్ల సున్నితమైన జి.ఐ. ట్రాక్ట్స్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి జీర్ణాశయాంతర బాధ కలుగుతుంది. దీని ఫలితంగా గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక తగు మోతాదులో ఉల్లిపాయలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదు.