శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (21:09 IST)

21-08-2022 నుంచి 27-08-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనుకూలతలు నెలకొంటాయి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్ర, శనివారాల్లో జాగ్రత్త. అవగాహన లేని విషయల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆది, సోమవారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రారంభోత్సలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్థత వేరొకరికి కలిసివస్తుంది. అయిన వారే వ్యతిరేకిస్తారు. పట్టుదలతో మెలగండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సమస్యలెదురవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ఆధ్యాత్మిక, యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
కుటుంబ సౌఖ్యం, వాహనయోగం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆందరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి విషయంలో శుభఫలితాలున్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల అనుకూలత బాగుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. ఆదివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ ఆధికం. ముఖ్యుల్య సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఎరువుల వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
కార్యం సిద్ధిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఇంతర్యం గ్రహించండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఎరువులు, విత్తన వ్యాపారులకు ఆశాజనకం. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. మానసికంగా కుదుటేపడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వివాహయత్నాం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. కార్మికుల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చులు,
ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సాగక విసుగు చెందుతారు. ఓర్పుతో మెలగండి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. సామాజిక, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
వేడుకను ఆర్బాంటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తి చేయగల్గుతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అవాంతరాలను ధీటుగా ఎదుర్కుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఆది, గురువారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.