శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (09:32 IST)

తెలంగాణాలో నేడు, రేపు ఐసెట్ - నాలుగు సెషన్‌లలో ప్రవేశపరీక్ష

tsicet
తెలంగాణా రాష్ట్రంలో ఐసెట్ ప్రవేశ పరీక్షలు బుధ, గురువారాల్లో జరుగనున్నాయి. ఈ రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. బుధవారం, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు మొత్తం నాలుగు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకుని రావాలని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డులుగా ఆధార్, పాన్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదేని ఒక కార్డును చూపించాలని కోరారు. 
 
అలాగే, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఖచ్చితంగా గంటన్నర ముందుగా చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఐసెట్ ప్రవేశ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 75958 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరువుతున్నట్టు ఆయన తెలిపారు.