1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జులై 2023 (09:43 IST)

మిజోరం ప్రజల ప్రయోజనాలకు ఉమ్మడి పౌర స్మృతి విరుద్ధం : సీఎం జోరామ్ తంగ

zoramtanga
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్ తంగ కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీ తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమంటూ వ్యాఖ్యానించారు. ఇదివరకే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ యూసీసీని వ్యతిరేకించారు. ఇపుడు మిజోరా ముఖ్యమంత్రి ఆ జాబితాలో చేరారు. వీరిద్దరూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కావడం గమనార్హం. ఎన్డీయే విధానాలు ప్రజలకు, మైనార్టీలకు ప్రయోజనం ఉన్నంత వరకే మద్దతిస్తామని మిజోరం సీఎం తెగేసి చెప్పేశారు. 
 
యూసీసీ అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమని, ముఖ్యంగా మిజోరాల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు మంగళవారం భారత న్యాయ కమిషన్‌కుక ఆయన ఓ లేఖ రాశారు. యూసీసీ మిజోరాల మతపరమైన, సామాజిక అంశాలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (జీ)ద్వారా రక్షించబడిన మిజోరం వాసుల ఆచారాలకు విరుద్ధంగా ఉందని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. 
 
మరో మిత్రపక్ష పార్టీ నేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా యూసీసీ విభేదించారు. యూసీసీ భారత ప్రస్తుత ఆలోచనలకు విరుద్ధమని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. సంగ్మా మాట్లాడిన కొన్ని రోజులకే జోరామ్ తంగ కూడా అదేవిధంగా మాట్లాడటం గమనార్హం. ఎన్డీయే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలకు, దేశంలోని మైనార్టీలకు ప్రయోజనకరంగా ఉన్నంత వరకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని చెప్పారు.