సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (12:33 IST)

బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే బహిరంగ సవాల్ : దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి

ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బహిరంగ సవాల్ విసిరారు. ప్రతిపక్ష బీజేపీకి దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని విసిరారు. బీజేపీతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక 'సామ్నా' ఆయనను ఇంటర్వ్యూ చేసింది. 
 
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోవడం, రాజస్థాన్‌లో అస్థిరతపై ఆయన స్పందిస్తూ, అంతర్జాతీయ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఈ రోజు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. కానీ... రాబోయే రోజుల్లో చైనా - భారత్ మిత్ర దేశాలుగా మారొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంది' అని ఉద్ధవ్ పేర్కొన్నారు. 
 
తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.