శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (14:09 IST)

కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి? తలసాని ప్రశ్న

తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించలేదని పెద్ద రచ్చ జరుగుతుంది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి?, కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు. 
 
బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి. చప్పట్లు కొట్టడం, దీపాలు ఎందుకు వెలిగించాలని మేము ప్రశ్నించామా?, ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదు.
 
ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి. ఎంఐఎంతో కలిస్తే.. కరోనా వచ్చేస్తోందా?, కేంద్రమంత్రి సమాధానం చెప్పాలి. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయి.'' అని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ ఫైర్ అయ్యారు.