గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (12:55 IST)

ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..

rape
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యం అయ్యింది. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నెంపున్నెం ఎరుగని ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చివరకు చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలిక కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా వారిని చూసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
రక్తమోడుతున్న బిడ్డను ఆసుపత్రికి తరలించాక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మహమ్మద్ ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు.