సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:36 IST)

రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య- 26కి పెరిగిన సంఖ్య

neet exam
రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూపీకి చెందిన మరో విద్యార్థి నీట్ పరీక్షల కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా విద్యార్థి మృతితో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.
 
కోటాలో నీట్ సంబంధిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.
 
విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.