మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (13:54 IST)

శరీరం రెండు ముక్కలైంది.. 14 గంటల తర్వాత ప్రాణం పోయింది..

రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి 14 గంటల పాటలు ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకోవాలని రైలు కింద పడ్డాడు. శరీరం రెండు ముక్కలైంది. అయినా 13 గంటల పాటు ప్రాణాలతో ఉన్నాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు.

ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పుర్‌ జిల్లాలో జరిగింది. హతోడా గ్రామానికి చెందిన ఓ యువకుడు పక్కనే ఉన్న రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే రైలు కింద పడ్డాడు.

అతని శరీరం రెండు ముక్కలై.. పైభాగం పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. అది చూసిన వాళ్లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దగ్గరికెళ్లి చూసి ఆ యువకుడిని హర్షవర్ధన్‌గా గుర్తించారు. అతడు చనిపోయాడేమో అని వారు భావించారు. అయితే హర్షవర్ధన్‌ వారితో మాట్లాడటంతో విస్తుపోయారు. 
 
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వారితో చెప్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాన్ని కొంతమంది తమ చరవాణుల్లో రికార్డు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. హర్షవర్ధన్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన 13 గంటల తర్వాత ఆ యువకుడు మరణించినట్లు చికిత్స అందించిన వైద్యురాలు పూజా పాండే తెలిపారు.