Triple talaq: కోర్టు బయట త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. కాళిగా మారిన భార్య.. చెప్పుతో దాడి.. వీడియో వైరల్
వరకట్న వేధింపులు సహా పిల్లల్ని లాక్కున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేగాకుండా కోర్ట బయట ట్రిపుల్ తలాక్ చెప్పడంతో తీవ్ర ఘర్షణ ఏర్పడింది. దీంతో బాధితురాలు తన భర్తను చెప్పుతో చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. రాంపూర్‌కు చెందిన ఓ మహిళకు 2028లో వివాహమైంది. పెళ్లయిన కొద్దికాలానికే అదనపు కట్నం కోసం భర్త వేధించాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఇంట్లో నుంచి గెంటేశాడని, ఆ తర్వాత తాను భరణం కోసం కోర్టును ఆశ్రయించగా పిల్లలను కూడా తన నుంచి బలవంతంగా లాక్కున్నాడని ఆమె వాపోయారు.
ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జరిగిన విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. విచారణ ముగిసి బయటకు వస్తున్న సమయంలో ఆమె భర్త, మామ ఆమెను అడ్డగించి, కేసును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు.
దీనికి ఆమె నిరాకరించడంతో, భర్త అక్కడికక్కడే మూడుసార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించారు. దీంతో ఆత్మ రక్షణ కోసం బాధితురాలు కాళిగా మారిపోయింది.
తన కాలి చెప్పు తీసి భర్త కుర్తా పట్టుకుని చితకబాదింది. మామపై కూడా దాడి చేసింది. కోపంతో బాధితురాలు చేసిన దాడిలో భర్త కుర్తా చిరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.