మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

యువకుడి కడుపులో గర్భాశయం : ఖంగుతిన్న వైద్యులు

uterus
యువకుడి కడుపులో గర్భాశయం ఉండటాన్ని చూసి వైద్యులు ఖంగుతిన్నారు. ఈ విచిత్ర సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధమ్‌తరీ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని 27 ఏళ్ల యువకుడు గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆ యువకుడు సెప్టెంబరు 25న ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యబృందం యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. 
 
అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి.. దాదాపు గంటన్నర శ్రమించి శస్త్రచికిత్స ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని.. మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని తెలిపారు.
 
అయితే, ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా జాప్యం చేస్తే భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉండేదని శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ రోషన్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని.. ప్రపంచంలో ఇలాంటివి 300 కేసులు ఉండవచ్చని చెప్పారు.