శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:33 IST)

ఆరేళ్ల అత్యాచార బాధితురాలు కన్నుమూత.. పది రోజులు పోరాడి..?

ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ ఘటన మరవకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదే రాష్ట్రానికి చెందిన ఆరేళ్ల బాలిక ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసింది. కామాంధుడి అకృత్యానికి బలైపోయిన ఆ చిన్నారి గత పది రోజులుగా చావుతో పోరాడుతూ మంగళవారం మరణించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌కు చెందిన సదరు చిన్నారి గతేడాది తన తల్లి మరణించడంతో మేనమామ ఇంటికి చేరుకుంది. 
 
అప్పటినుంచి వాళ్లతో కలిసి అలీఘడ్‌లోని ఇగ్లాస్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం బాధితురాలి కజిన్‌ ఒకడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.