యూపీలో మరో ఘోరం.. పొలాల్లో ముక్కలు ముక్కలుగా బాలిక మృతదేహం!

murder
ఠాగూర్| Last Updated: ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. హత్రాస్ ఘటన మరిచిపోకముందే ఇద్దరు మహిళ అత్యాచారానికి గురయ్యారు. తాజాగా మరో బాలిక అత్యాచారానికి గురైంది. పైగా, ఈ బాలికను హత్య చేసి, ముక్కలు ముక్కలు చేసి పంట పొలాల్లో పడేశారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 26వ తేదీన ఓ బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఈ బాలిక పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో విగతజీవిగా కనిపించింది.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాలిక మృతదేహం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఈ ఘోరానికి పాల్పడింది బాలిక బంధువులేనని అనుమానిస్తూ, వారిని అరెస్ట్ చేశామని కాన్పూర్ దేహత్ జిల్లా ఎస్పీ కేకే చౌదరి వెల్లడించారు.

తమ బిడ్డపై అత్యాచారం చేసి, హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, తమ భూమిపై వివాదాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే తన బిడ్డపై హత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్నామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :