గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (12:19 IST)

ఓనర్‌పై కోపం.. ఆరేళ్ల కూతురిపై అత్యాచారం, హత్య.. చివరికి గ్రామస్తుల చేతిలో బలి..

యజమానిపై కోపాన్ని.. ఆ కీచకుడు చిన్నారిపై చూపించాడు. ఓనర్ తనను అవమానించాడనే కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తించాడు. కానీ చివరకు గ్రామస్తుల చేతిలోనే హతమయ్యాడు. యూపీలోని అలీఘడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

యజమానిపై కోపాన్ని.. ఆ కీచకుడు చిన్నారిపై చూపించాడు. ఓనర్ తనను అవమానించాడనే కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తించాడు. కానీ చివరకు గ్రామస్తుల చేతిలోనే హతమయ్యాడు. యూపీలోని అలీఘడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బదౌన్ గ్రామానికి చెందిన ఒక యువకుడు బీకమ్‌పూర్‌లో ఉద్యోగం చేసేవాడు. కానీ ఏవో కారణాలతో యజమాని అతనిని పని నుంచి తొలగించాడు. 
 
దీంతో యజమానిపై పగ పెంచుకున్న అతను యజమాని ఆరేళ్ల కుమార్తెను మభ్యపెట్టాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై హత్య కూడా చేశాడు. కుమార్తె కనిపించకపోవడంతో కలత చెందిన యజమాని గాలింపు చర్యలు చేపట్టడంతో.. అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. 
 
పక్కనే మద్యం మత్తులో ఉన్న యువకుడిని గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని గ్రామస్తులు నిందితుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.