ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (10:00 IST)

ఒకే గ్రామానికి చెందిన వ్యక్తుల్ని పెళ్లాడిన బాలీవుడ్ భామలు.. నెల నెలా రేషన్ తీసుకుంటున్నారు!

బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకా చోప్రా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌లు ఒకే గ్రామానికి చెందిన వ్యక్తుల్ని పెళ్లాడారంటే నమ్ముతారా? ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టో

బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకా చోప్రా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌‌లు ఒకే గ్రామానికి చెందిన వ్యక్తుల్ని పెళ్లాడారంటే నమ్ముతారా? ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా రహస్యంగా ఒకే గ్రామస్తులను పెళ్లాడారు. ఆ గ్రామం పేరు సాహేబ్‌ గంజ్‌. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉంది ఈ గ్రామం. అంతేకాదు నెలనెలా వాళ్లు ఇక్కడకి వచ్చి రేషన్‌ కూడా తీసుకుంటున్నారట. 
 
కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మాత్రం బాలీవుడ్ హీరోయిన్లను తెగ వాడేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి సాహెబ్‌ గంజ్‌లోని ఓ రేషన్‌ డీలర్‌. ఆ బాలీవుడ్‌ హీరోయిన్లు అందరూ తమ గ్రామానికి చెందిన వ్యక్తులను పెళ్లాడి, అక్కడకు కాపురానికి వచ్చేసినట్టు దొంగ రేషన్‌ కార్డులు కొట్టించాడు. అంతేకాదు వారి నెలసరి ఆదాయం రూ.11 వేలుగా నిర్ణయించి ప్రతీ నెలా వారికి రేషన్‌ సరుకులు ఇచ్చేస్తున్నాడు.
 
రేషన్ కార్డులపై ఆ బాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలు, పేర్లు వేసి తనకు కావాల్సిందంతా దోచుకుంటున్నాడు. ఇలా సోనాక్షి, దీపికా, ప్రియాంకా చోప్రా, రాణీ ముఖర్జీ పేర్లను ఆ వ్యక్తి తెగ వాడుకున్నాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.