బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 12 జూన్ 2017 (21:06 IST)

రేప్ చేసినవాడితోనే పెళ్లి... రూ.5 లక్షల కట్నం డిమాండ్...

ఉత్తరాదిన... అదీ ఉత్తరప్రదేశ్ అంటేనే అత్యాచారాలకు నెలవైన రాష్ట్రంగా మారిపోతోంది. అమ్మాయిలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు తెచ్చినా అవి అమలుకు నోచుకుంటున్న దాఖలాలు వుండటంలేదు.

ఉత్తరాదిన... అదీ ఉత్తరప్రదేశ్ అంటేనే అత్యాచారాలకు నెలవైన రాష్ట్రంగా మారిపోతోంది. అమ్మాయిలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు తెచ్చినా అవి అమలుకు నోచుకుంటున్న దాఖలాలు వుండటంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ తనకు కట్నంగా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ పెట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా గ్రామానికి చెందిన తాజ్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేశాడు. దాంతో తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని ఆమె తల్లిదండ్రులు ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పెద్దలు ఓ పంచాయతీ చేశారు. అదేమిటంటే... అత్యాచారం చేసిన దానికి కేసులేమీ పెట్టబోమనీ, ఐతే ఆమెను వివాహం చేసుకోవాలని సూచన చేశారు.
 
పెద్దల ముందు సరేనని తలకాయను ఆడించిన తాజ్.. పెళ్లి రోజు దగ్గరపడేసరికి తన నిజరూపం మరోసారి బయటపెట్టాడు. తనకు రూ. 5 లక్షలు కట్నంగా ఇస్తేనే అమ్మాయి మెడలో తాళి కడతానంటూ కండిషన్ పెట్టాడు. దాంతో చేసేది లేక బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.