కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ శర్మ ఇకలేరు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ ఇకలేరు. ఆయన బుధవారం రాత్రి గోవాలో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సతీశ్ శర్మ 11 అక్టోబరు 1947లో తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు.
అమేథీ, రాయ్‌బరేలీ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. 1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సతీశ్‌శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీశ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.