నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)
బెంగుళూరు మహానగరంలో ఓ ప్రేమజంట విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, బైకుపై రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలోని దృశ్యాలను చూస్తే, ఓ యువకుడు బైకు నడుపుతుండగా యువతి ముందువైపు నుంచి ఇంధన ట్యాంకుపై అతడిని గట్టిగా హగ్ చేసుకుని కూర్చునివుంది.
బెంగుళూరులోని సర్జాపుర మెయిన్ రోడ్డులో ఓ ప్రైవేటు జంట ఇలా రొమాన్స్ చేసుకుంటూ కనిపించడంతో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రేమికులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏమాత్రం క్షమించరాదని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమని వారు పేర్కొంటూ ఆ ప్రేమ జంటను బెంగుళూరు పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.