సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (17:28 IST)

శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం: హనీమూన్‌లకు వాడే..?

Dal Lake
Dal Lake
ప్రముఖ పర్యాటక కేంద్రం శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.శ్రీనగర్ లోని దాల్ లేక్, నిజీన్ సరస్సుల నీటిపై తేలియాడే ప్యాలెస్‌లుగా పేరొందని ఈ హౌస్ బోట్లు సంపన్నులు ఎక్కువగా విడిది చేస్తుంటారు. హనీమూన్‌లకు ఇటవంటి లగ్జరీ బోట్లను వినియోగిస్తుంటారు. 
 
అలాంటి ఈ దాల్ సరస్సులోని ఘాట్ నెంబర్ 9 సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదు హౌస్ బోట్లు దగ్థమయ్యాయి. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సరస్సులో ‘లండన్ హౌస్, సపేనా, లల్లా రుఖ్ అనే పేర్లు గల హౌస్ బోట్లు దగ్థమయ్యాయని అధికారులు తెలిపారు.