శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (09:26 IST)

మద్యం మత్తులో డ్యాన్స్ చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్.. సస్పెండ్

Police
Police
కేరళ, పూప్పరలోని ఆలయ ఉత్సవంలో సబ్-ఇన్‌స్పెక్టర్ మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫలితంగా అతని సస్పెన్షన్ వేటు పడింది. కేపీ షాజీ అనే అధికారి ఇడుక్కిలోని సంతన్‌పరా పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌గా ఉన్నారు. 
 
వీడియో బయటపడిన తర్వాత, స్పెషల్ బ్రాంచ్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. వారి నివేదిక ఆధారంగా, కొచ్చి రేంజ్ డిఐజి ఎ శ్రీనివాస్ షాజీపై చర్యలు తీసుకున్నారు. అధికారి విధుల్లో ఉండగా మద్యం మత్తులో ఉన్నారని, అనుచిత ప్రవర్తన, పోలీసు బలగాల ప్రతిష్టకు హాని కలిగించే అవకాశం ఉన్నందున అతనిని సస్పెండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
 
పూప్పరలోని మారియమ్మన్ ఆలయంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా స్టేషన్‌లోని షాజీ-ఇతర అధికారులకు భద్రతా విధులను కేటాయించారు. అయితే, అధికారి ప్రవర్తన అదుపు తప్పడంతో చివరకు స్థానికులు కొందరు అతన్ని అక్కడి నుంచి తొలగించారు.