సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:27 IST)

ఢిల్లీ మెట్రో స్టేషన్: ఎర్రటి చీరతో స్టెప్పులేసిన మహిళ.. వీడియో వైరల్

Bhojpuri
Bhojpuri
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ భోజ్‌పురి పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, మహిళ ఎర్రటి చీర ధరించి, ఖేసరీ లాల్ యాదవ్, ప్రియాంక సింగ్ పాడిన "సాజ్ కే సావర్ కే" పాటకు డ్యాన్స్ చేస్తోంది. 
 
అవ్నికరిష్ అనే మహిళ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసింది. కొందరు మహిళ నృత్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు వీడియో చిత్రీకరించిన ప్రదేశాన్ని విమర్శించారు. 
 
చాలామంది ప్రజలు మెట్రోలో డ్యాన్స్ వీడియోలను ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రో రైలులో ఇలాంటి వీడియోలు చిత్రీకరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.