గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (10:59 IST)

మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి.. ఫోన్ చూస్తూ వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏమైంది?

మద్యం సేవించేందుకు మిద్దెపైకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భరత్‌పూర్ జిల్లాలో బయానా పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబా టాకీస్ దగ్గర హరిజన బస్తీ ఉంది. సోమవారం సాయంత్రం ఆ బస్తీలో ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయనకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. 
 
తన వెనుక ఏదో పడినట్టు శబ్ధం వచ్చి వెనక్కి తిరిగాడు. అంతే అక్కడ పడింది చూసి ఖంగుతిన్నాడు. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కింద పడ్డాడు. కిందపడిన వ్యక్తి పేరు సురేష్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది.
 
సోమవారం సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగొచ్చాకా.. మద్యం సేవించాలని సురేష్ మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తల నేరుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్ కిందపడిన సంఘటన మొత్తం అతడి ఇంటిపక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.