శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (14:08 IST)

జయలలిత వల్లే మాకు ఈ కష్టాలు : దివాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు.
 
తమిళనాట తమపై వరుసగా జరుగుతున్న దాడులకు జయలలితే కారణమని ఆరోపించారు. తాను మరణించిన తర్వాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఎంతమాత్రమూ పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు.
 
జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు. శశికళను పూర్తిగా వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయలేదని, ఫలితంగానే ఆమె ఇపుడు జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
శశికళ కుటుంబీకులు చేసిన మోసం కారణంగానే జయలలితపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగి, మేమే అమ్మను మోసం చేసుంటే, ఆమె దోషిగా ఎలా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమ కుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నాడు.
 
'అమ్మ'తో కలిసున్న కారణంగానే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలంటూ సూచన చేశారు.