శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (02:09 IST)

నీళ్లిస్తారా చావమంటారా అంటూ తపించిన నాగుపాము.. నీళ్లిచ్చి కాపాడిన గ్రామస్తులు

నీళ్లు, లేదా పాలు పెడితే పాము వచ్చి తాగి పోతుందని జనంలో ఇన్నాళ్లూ ఉన్న నమ్మకం నమ్మకం మాత్రమే కాదని అది నిజమని ఆ పాము తన దాహం సాక్షిగా నిరూపించింది. ఎంత దూరం పాకినా నీళ్లు లేవు. దప్పిక.. గొంతెండిపోతోంది. ఎక్కడున్నాయిరా నీళ్లు అంటూ ఒక నాగుపాము నేరుగా ఊ

నీళ్లు, లేదా పాలు పెడితే పాము వచ్చి తాగి పోతుందని జనంలో ఇన్నాళ్లూ ఉన్న నమ్మకం నమ్మకం మాత్రమే కాదని అది నిజమని ఆ పాము తన దాహం సాక్షిగా నిరూపించింది. ఎంత దూరం పాకినా నీళ్లు లేవు. దప్పిక.. గొంతెండిపోతోంది. ఎక్కడున్నాయిరా నీళ్లు అంటూ ఒక నాగుపాము నేరుగా ఊర్లోకి వచ్చేసింది. నోము వంటి పాత సినిమాల్లో భక్తి పిచ్చి ఎక్కువైన హీోయిన్లు పుట్టలో పాలుపోస్తే తాగి పైకి వచ్చినట్లుగా పుట్ట ముందు పాలు పెడితే లోపలనుంచి వచ్చి తాగి వెళ్లనట్లుగా ఆ పాము ప్రాణం కాపాడుకోవడానికి గుక్కెడు నీళ్లకోసం అడవి దాటి గ్రామం చేరుకుంది.
 
దాని అదృష్టం బాగుండి చూడగానే వెంటాడి చంపేసే పల్లె జనం దృష్టిలో పడకుండా పాముల గురించి కాస్త అవగాహన కలిగిన వ్యక్తి కంట పడింది. తాగేనీళ్లు లేక దాహంతో అది అడవి సరిహద్దులు దాటి ఊర్లోకి వచ్చిందని గ్రహించిన అతడు స్థానిక పోలీసుల సాయంతో ఆ నల్లతాచుకు బాటిల్తో మినరల్ వాటర్ తాగించాడు. 
 
నల్లతాచు సాధారణంగా మనుషుల కంట పడదు. పడినా వారితో తలపడదు. కానీ అవసరం, భయంకరమైన దప్పిక మనిషిని వెతుక్కుంటూ వచ్చింది. కర్ణాటకలోని కైగా టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ గ్రామంలో  జరిగిన ఈ ఘటన మనిషికి, ఇతర ప్రాణులకు మధ్య ఉన్న మానవీయ అనుబంధాన్ని కొత్త పుంతలు తొక్కించింది.
 
ఎంత దప్పిక గొని ఉన్నా పాము పామే కాబట్టి దాన్ని చూసిన వ్యక్తి జాగ్రత్తగా పాములు పట్టే అతడి సహాయంతో ఒక బాటిల్ నీరు తెచ్చి పాముకు పోశాడు. ఆ పాము ఆబగా పడగ ఎత్తి నీరు కొంచె కొంచె తాగింది.  పాములు పట్టే అతను దాని తోకను గట్టిగా పట్టుకుని ఆ పాము ముందుకు కదిలి కాటు వేయకుండా జాగ్రత్త వహించాడు. 12 అడుగుల ఆ నాగుపాము తనివితీరా నీరు తాగింది. ఎండలో మాడి వచ్చిన ఆ పాముకు తాగడానికి నీళ్లు ఇవ్వడమే కాకుండా దాని తలపైన పోసి అది చల్లబడేలా చూశారు. తర్వాత ఆ పామును సర్ప సంరక్షణ కేంద్రానికి తరలించారు.