ఎగిరే తేళ్లను చూశారా? లేదంటే.. ఈ వీడియో చూడండి..
అవును.. తేళ్లను నేలపై చూసివుంటాం. అయితే ఎగిరే తేళ్లను చూడలేదంటే.. ఈ వీడియోలో చూడవచ్చు. తేళ్ల తోక ప్రాంతంలో విషం వుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో వున్న తేళ్లకు రెక్కలు వున్నా.. అవి తేళ్ల జాతికి చెందినవి కావు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే నేలపై పాకే తేళ్లు కుడితేనే ఇక నరకం కనబడుతుంది. అలాంటిది ఎగిరే తేళ్లు కరిస్తే అంతే సంగతులు. ఇలాంటివి వున్నాయని పెద్దగా జడుసుకోనక్కర్లేదు.
ఈ వీడియోలోని జీవిని చూసేందుకు తేలులా అనిపిస్తున్నప్పటికీ తేలు జాతికి చెందినది కాదు. కందిరీగ, తేనెటీగ, పురుగు వంటి జాతులకు చెందినది. కాకపోతే వీటికి తోక భాగంలో తేలును పోలి ఉంటుంది. అందులో ఎలాంటి విషం ఉండదు. ఇది వాటి మర్మాంగం. ఇది కేవలం మగజీవులకే ఉంటుంది. కాబట్టి తేలు ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేముంది.. ఎగిరే తేళ్లలా వుండే ఈ పురుగును వీడియోలో చూడండి..