శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (20:23 IST)

మునగ నూనె గురించి తెలిస్తే తప్పక వాడుతారు.. (video)

Moringa Oil
మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అలాగే మునగ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూవారీ డైట్‌లో మునగ నూనెను వాడటం ద్వారా మధుమేహం తొలగిపోతుంది. 
 
మునగలో ప్రోటీన్లు పుష్కలంగా వుండటంతో శరీరానికి బలం చేకూరుతుంది. సాధారణంగా మెరిసే చర్మాన్ని పొందాలంటే.. యాంటీ-యాక్సిడెంట్లు, యాంటీ- ఏజింగ్ గుణాలున్న మునగ నూనెను వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ నూనె రక్తాన్ని శుభ్రపరుస్తుంది. 
 
ఈ నూనెను వాడితే చర్మ సమస్యలుండవు. జుట్టు నెరవదు. కేశాలకు బలం చేకూరుతుంది. రోజూ మనం వాడే నూనెల్లో రెండు స్పూన్ల మేర మునగ నూనెను చేర్చి వాడితే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇంకా కేశాలకు చుక్కల పరిమాణంలో ఈ నూనెను వాడినా మంచి ఫలితం వుంటుంది. తల మాడుకు ఈ నూనెను రాయడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. 
 
మృదువైన కేశాలు, చర్మం లభిస్తుంది. అంతేగాకుండా మునగ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, ఐరన్ వంటి ధాతువులు శరీరానికి లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.