1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (21:40 IST)

తన ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన పాకిస్థాన్ పక్కింట్లో మంట పెడుతోంది: కిషన్ రెడ్డి

పాకిస్థాన్ కుట్రలపై నిప్పులు చెరిగారు కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కుక్కతోక వంకర అయినట్లు పాకిస్థాన్ వక్రబుద్ధి మానడం లేదన్నారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్ధ పూర్తిగా చిన్నాభిన్నామైందన్నారు. తన ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన పాకిస్థాన్ పక్క ఇంట్లో మంటపెట్టాలని ప్రయత్నిస్తోంది, అది సఫలం కాదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా గాలికొదిలేశారని.. సీజ్ 5 వయెలేషన్‌కు పాకిస్థాన్ పాల్పడుతోందన్నారు. 
 
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి అక్రమంగా భారత్ లోకి పంపుతున్నారన్న కిషన్ రెడ్డి, పాకిస్థాన్ నుంచి ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. ఎట్టి పరిస్థితుల్లోను పాకిస్థాన్ ప్రయత్నాలను సఫలం కానివ్వమని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్‌ను ఏకాకి చేశామన్నారు కిషన్ రెడ్డి. 
 
ఒక్క చైనా తప్ప మిగిలిన ఏ దేశం కూడా పాకిస్థాన్‌తో కలవడానికి ఇష్టపడటం లేదని.. నరేంద్రమోడీ వ్యూహాల ముందు పాకిస్థాన్ పప్పులు ఉడకటం లేదన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత ఎపి ప్రభుత్వంపై ఉందన్న కిషన్ రెడ్డి.. ఎపి ప్రభుత్వం ఆ దిశగా ప్రతిపాదనలు పంపితే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. 
 
ఉపాధి అవకాశాలు కోల్పోయిన చేతివృత్తులు, ఎంఎస్ఎంఈ, సాంప్రదాయ వస్త్రాలను తయారుచేసే వారు పూర్తిగా ఉపాధి కోల్పోయారు.. వారికి ఉపాధి కల్సించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.