శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (12:51 IST)

రాష్ట్రపతి పోస్టు నాకొద్దన్న మోహన్ భగవత్.. అద్వానీకి లైన్ క్లియర్..?

బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి బాబ్రీ మసీదు ధ్వంసం గండం పొంచివున్న కారణంగా.. ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే విషయం పక్కనబడిందని టాక్. అద్వానీతో పాటు బీజేపీ మరో సీనియర్‌

బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి బాబ్రీ మసీదు ధ్వంసం గండం పొంచివున్న కారణంగా.. ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే విషయం పక్కనబడిందని టాక్. అద్వానీతో పాటు బీజేపీ మరో సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, ప్రస్తుత కేంద్రమంత్రి ఉమా భారతి, ఇతర బీజేపీ నాయకులు మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
 
కానీ అయితే అద్వానీకి రాష్ట్రపతి పదవిని గురు దక్షిణగా సమర్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరా ఖండ్ శాసనసభల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుంది.
 
ఫలితంగా రాష్ట్రపతిగా తనకు నచ్చిన నేతను గెలిపించుకోగలిగే సామర్థ్యం బీజేపీకి లభిస్తుంది. ఈ క్రమంలో అద్వానీనీ రాష్ట్రపతి చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 1998-2004 మధ్య ఆయన కేంద్ర హోం మంత్రిగా పని చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. 
 
అయితే రాష్ట్రపతి రేసులో ఉన్న నేతల్లో అద్వానీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని మోహన్ భగవత్ తేల్చేశారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తానులేనని చెప్పడంతో ఆయనపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే తాము మద్దతిస్తామని శివసేన నేత చెప్పారు. రాష్ట్రపతి రేసులో తాను లేనని చెప్పేశారు. 
 
పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా అంగీకరించేదిలేదని కుండబద్దలు కొట్టారు. తాను ఆర్ఎస్ఎస్‌కు అధినేతగా పనిచేస్తానని చెప్పారు. భగవత్ నుంచి క్లారిటీ రావడంతో దాదాపుగా అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖాయమని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.