తరచూ మల్లెపూలు తెచ్చే భర్తలో మార్పు.. భార్య ఏం చేసిందంటే?
తరచూ మల్లెపూలు తెచ్చి తనను సంతోషంగా చూసుకునే భర్తలో కొన్నాళ్లుగా మార్పు వచ్చింది. పూలు తేవడం మానేయడమే కాకుండా ఇంటికి కూడా సరిగా రావట్లేదు. కారణమేంటంటే... వ్యాపారంలో పనులు ఎక్కువయ్యాయని, కొత్త రూల్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు. అది నమ్మని పింకీ... తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బలంగా నమ్మింది.
దీనిపై ఆమె ప్రశ్నించిన ప్రతిసారీ తనను అనుమానించొద్దు అంటూ రివర్స్ అయ్యేవాడు. రాన్రానూ ఇద్దరి మధ్యా గ్యాప్ బాగా పెరిగింది. ఎంతలా అంటే... ఇక తన భర్తపై ఆమెకు ఏమాత్రం ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ స్థానంలో పగ చేరింది. తనను చీదరించుకునే భర్తను చంపేయడమే కరెక్ట్ అనుకునే స్థాయికి ఆ పగ చేరింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్... భిల్వారా జిల్లాకు చెందిన పింకీ అనే మహిళ చెల్లెలి కూతురి భర్త కులదీప్ సింగ్. అతన్ని పిలిచి తన భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది. ఆ కులదీప్ మరో ఇద్దర్ని వేసుకొచ్చాడు. ముగ్గురూ ఫలానా తేదీన వచ్చి ఎలా మర్డర్ చెయ్యాలో ప్లాన్ వేసుకున్నారు.
అదే విధంగా ఆగస్ట్ 22న ప్లాన్ అమలు చేశారు. దేవీసింగ్‌ను నరికేసి వాళ్లు వెళ్లబోతుంటే... పింకీ వాళ్లను ఆగమంది. పూర్తిగా చచ్చేవరకూ ఆగి అప్పుడు వెళ్లమంది.
వాళ్లు అదే చేశారు. ఆ తర్వాత శవంపై పడి బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. డ్రామా బాగా పండింది. ఊళ్లో అంతా నమ్మేశారు. పోలీసులూ మొదట నమ్మారు. తర్వాత కనిపెట్టారు.
ప్రస్తుతం ఆ ముగ్గురూ పరారీలో ఉన్నారు. వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ వివాహేతర సంబంధం ఉందా లేదా అన్నది పోలీసులు అప్పుడే చెప్పలేం అన్నారు. ఈ కేసులో భర్తకు విడాకులు ఇచ్చేసి ఉంటే... పింకీ తన బతుకేదో తాను బతికేది. అతని జీవితం అతను జీవించేవాడు.
అలా చెయ్యకుండా అతన్ని చంపేసి జైలుపాలైంది. అంతేకాదు మరో ముగ్గుర్ని కూడా హంతకులుగా మార్చింది. అటు దేవీసింగ్ ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.