సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (13:41 IST)

భార్యపై అనుమానం.. జననేంద్రియాలను కుట్టేసి పారిపోయాడు..

మహిళలు అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అనుమానంతో భార్య పట్ల ఓ భర్త క్రూరంగా ప్రవర్తించాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. 
 
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే రైలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య తనను మోసం చేస్తుందని, మరొకరితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలో ఆమె జననేంద్రియాలను కుట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
పరారీలో ఉన్న తన భర్తను ఏం చేయొద్దని, చర్యలు తీసుకోవద్దని భార్య పోలీసులను కోరింది. రెండు మంచి మాటలు చెప్పి పంపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.