సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (09:51 IST)

స్వాతంత్ర్య సమరయోధుల కలలు సాకారం చేద్దాం : ప్రధాని నరేంద్ర మోడీ

Republic Day
స్వాతంత్ర్య సమరయోధుల కలలు సాకారం కావాలంటే మనమంతా ఉమ్మడిగా ముందుకుసాగుదాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చాచుర. భారత్ 74వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఆయన యావత్ దేశ ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
'భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను' అని పిలుపునిచ్చారు. ఈ మేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు.
 
ఇదిలావుంటే గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతియేటా నిర్వహించే వేదిక, బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌ను పునరుద్ధరించి దానికి కర్తవ్య పథ్‌గా పేరు మార్చారు. ఈ కర్తవ్య‌పథ్‌పైగా తొలిసారిగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి హాజరయ్యారు.
 
కర్తవ్య‌పథ్‌లో జరగనున్న వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 6 మంత్రిత్వశాఖలు, విభాగాలు పాల్గొననున్నాయి. దేశ శక్తిసామర్థ్యాలు, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వృద్ధి, మహిళాసాధికారిత వంటి విభిన్న అంశాలను వేడుకల్లో ప్రతిబింబించనున్నాయి. వందేభారతం డ్యాన్స్ కాంపిటీషన్ కోసం దేశవ్యాప్తంగా 479 మంది కళాకారులను ఎంపిక చేశారు. ఈ బృందం ప్రదర్శన చేయనుంది.
 
రాష్ట్రపతికి 21-గన్ సెల్యూట్ సమర్పించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఫీల్డ్ ఫిరంగి స్థానంలో దేశీయంగా తయారు చేసిన ఫిరంగిని ప్రవేశపెట్టనున్నారు. భారత తొలి ప్యాసింజర్ డ్రోన్ ప్రదర్శన. అలాగే, ప్రపంచంలోనే తొలి మహిళా 'ఒంటెల రైడర్ల, ప్రదర్శన చేయనుంది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గరుడ్ కమాండోస్ తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటున్నాయి.