ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (12:11 IST)

పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే ప్రియుడితో జంప్.. భర్త నగలు ఇచ్చేసింది..

ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకడితో. అలా పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే ప్రియుడి వద్దకు పారిపోయింది ఓ మహిళ. తమిళనాడులోని చిన్నమసముద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన సత్య.. సెంగవల్లి నడువలూరుకు చెందిన రవికుమార్‌తో ఈ నెల 4న పెళ్లి జరిగింది. తల్లిదండ్రుల బలవంతంతో సత్య పెళ్లికి ఒప్పుకుంది. ఆ రోజే అత్తారింటికి వెళ్లింది. ప్రియుణ్ని తలచుకుంటూ పశ్చాత్తాపంతో తెగ కుమిలిపోయింది. 
 
మరుసటి రోజు సాయంత్రం షాపుకు వెళ్ళొస్తానని బయటికి వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి భర్త రవికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు సత్య తన ఊరికే చెందిన వల్లరసు అనే యువకుడితో అత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. 
 
తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, తర్వాత ప్ర్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకున్నానని పోలీసుల వద్ద పంచాయితీ జరిగింది. తనకు భర్త పెట్టిన నగలు వద్దంటూ తిరిగి ఇచ్చేసింది. అయితే పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వాలని రవికుమార్ పట్టబట్టాడు. అంతేగాకుండా ప్రియుడుతో కలిసిపోయాయ్.. తన పరిస్థితి ఏంటని వాపోయాడు.