శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (19:08 IST)

ముంబై రైలులో బెల్లీ డ్యాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్

Belly Dance
Belly Dance
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణికులు రీల్స్ చేస్తున్నారు. ప్రేమ జంటలు ఒకడుగు ముందుకేసి రొమాన్స్ పంట పండిస్తున్నారు. ఇప్పటికే పలు వీడియోలు సామాజిక వెబ్‌సైట్లలో వైరల్‌గా ఉన్నాయి. ఈ వీడియోల కారణంగా మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు కొన్ని హెచ్చరికలను అందించింది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలోని ప్రయాణికుల రైలులో యువతి ఒకరు 'బెల్లి' డ్యాన్స్ చేసిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. శాండ్‌హార్స్ట్ రోడ్ -మస్జిత్ స్టేషన్‌ల మధ్య రైలు వెళ్ళినప్పుడు ఓ మహిళ బెల్లీ డ్యాన్స్ చేసింది.
 
డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో యూజర్‌లు చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాగే ప్రవర్తించే ప్రయాణికులపై ముంబై పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.