1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2023 (19:09 IST)

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: కారులోనే పచ్చి బఠానీల కాయల్ని గిల్లుకున్న మహిళ, xలో పోస్ట్

peas
బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి అందులో ఇరుక్కున్నవారికే తెలుసు. పీక్ టైంలో రోడ్లపై వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోతుంటాయి. ఈ రద్దీలో ఇరుక్కుపోయినవారు విలవిలలాడిపోతుంటారు.
 
బెంగుళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి వుండటం అక్కడి వాహనదారుల్లో చాలామందికి అలసిపోయే అనుభవంగా ఉంటుంది. అంతేకాదు ప్రయాణీకులు సమయాన్ని గడపడానికి వినూత్న మార్గాలను అవలంభిస్తుంటారు. ఇటీవల, ఒక మహిళ ఎలాగూ తను ట్రాఫిక్‌లో చిక్కుకోవడం ఖాయం కనుక ఆ గ్యాప్‌లో ఏం చేయాలో నిర్ణయించుకున్నట్లుంది.
 
తనతోపాటు కూరగాయలను తెచ్చుకుని ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా వాటి పని చేసుకున్నది. కారు డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చున్న ఆమె ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా సంచీలోని పచ్చి బఠానీల కాయల్ని బయటకు తీసి వాటిని గిల్లుకుంటూ టైంపాస్ చేసింది. అంతేకాదు... ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేసింది. "పీక్ ట్రాఫిక్ సమయంలో ఉత్పాదకంగా ఎలా వుండాలో నేను నేర్చుకున్నాను" అని మహిళ ఫోటోతో పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.