గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By mohan
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:07 IST)

పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్న కేరళ రాష్ట్రం

ఆగస్ట్ నెలలో వచ్చిన వరదలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వరద భీభత్సం నుండి త్వరగానే కోలుకున్నట్లుంది. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే ఆ రాష్ట్ర టూరిజం గురించి సాంసొనైట్ బ్రాండ్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల వీడియోని రూపొందించింది. అ

ఆగస్ట్ నెలలో వచ్చిన వరదలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వరద భీభత్సం నుండి త్వరగానే కోలుకున్నట్లుంది. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే ఆ రాష్ట్ర టూరిజం గురించి సాంసొనైట్ బ్రాండ్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల వీడియోని రూపొందించింది. అందులో టూరిజంపై ఆధారపడి జీవించే వారిని చూపిస్తూనే వారు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసారు. 
 
భారతదేశంలో కేరళ రాష్ట్రం అనేక సందర్శనీయ ప్రదేశాలను, కళలను, కళాఖండాలను, కళాకారులను కలిగి ఉంది. సాంసొనైట్ సంస్థ రూపొందించిన వీడియోలో కస్టమర్‌ల కోసం వేచి ఉన్న హోటల్ యజమానిని, ప్రయాణీకుల కోసం ఎదురు చూసే లేడీ ట్యాక్సీ డ్రైవర్‌ను, ప్రేక్షకుల కోసం ఎదురు చూసే కథాకళి నృత్యకారుడిని, అదే విధంగా వేయించిన చేపలను విక్రయించే ఫాతిమా కొనే వారి కోసం వేచి చూస్తున్నట్లు చూపించారు. 
 
చివరగా పర్యాటకుల కోసం "వి ఆర్ ఒపెన్" అంటూ చూపించి అందరినీ ఉద్విగ్నానికి గురైయ్యేలా చేసారు. ఏదైమైనా కేరళ రాష్ట్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.