బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:22 IST)

సాంబారు సరిగా చేయలేదనీ తల్లి - చెల్లిని కాల్చి చంపిన ఉన్మాది

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. సాంబారు సరిగా చేయలేదనీ ఓ ఉన్మాది కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కాల్చి చంపేశారు. దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా కుడగోడుకు చెందిన మంజునాథ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం తాగిన మత్తులో ఇంటికొచ్చిన మంజునాథ్ భోజనం చేస్తూ సాంబారు పోసుకున్నాడు. 
 
మద్యం మత్తులో ఉన్న అతడికి అది రుచించలేదు. దీంతో సాంబారును ఇంత దరిద్రంగా ఎలా చేశారంటూ తల్లి పార్వతి (42), సోదరి రమ్య (19)తో వాగ్వివాదానికి దిగాడు. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంజునాథ్ తన వద్ద ఉన్న నాటు తుపాకితో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడు. 
 
గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.