శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 జనవరి 2021 (17:47 IST)

మరోమారు వినియోగదారుల ముంగిటకొచ్చిన స్పెన్సర్స్ సంక్రాంతి సంబరాలు

కిరాణా, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, పండుగ ఫ్యాషన్ కలెక్షన్‌పై మహోన్నతమైన ఆఫర్లతో ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలను స్పెన్సర్స్ రిటైల్ వేడుక చేస్తోంది. ఈ వేడుకలు జనవరి 6 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరుగనున్నాయి.

ఈ సంవత్సరం స్పెన్సర్స్ కొనుగోలుదారులు పండుగ ఉత్పత్తులపై మరే ఇతర రిటైలర్ అందించనటువంటి రీతిలో భారీ రాయితీలను పొందవచ్చు. వినియోగదారులు 1499 రూపాయలు మరియు ఆ పైన కొనుగోలు చేసినట్లయితే 2 కేజీల పంచదార పూర్తి ఉచితంగా పొందవచ్చు. అలాగే పేటీఎం చెల్లింపులపై 10% క్యాష్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు.
 
దీని గురించి శ్రీ దేవేంద్ర చావ్లా, సీఈవొ-స్పెన్సర్స్ రిటైల్ అండ్ నేచర్ బాస్కెట్ మాట్లాడుతూ, "మా వద్ద కొనుగోలు చేసిన ప్రతిసారీ వినియోగదారులు అత్యుత్తమ పొదుపు పొందగలరనే భరోసా అందించడానికి మేము నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. సంక్రాంతి సంబరాల అమ్మకాలతో, మా వినియోగదారులు ఆన్‌లైన్, ఫోన్ డెలివరీ మరియు స్టోర్ లోపల సైతం అతి తక్కువ ధరలలో వస్తువులను పొందగలరు'' అని అన్నారు.
 
మరో షాపింగ్ అద్భుతాన్ని 6 జనవరి నుంచి 15 జనవరి వరకూ మీ దగ్గరలోని స్పెన్సర్స్ స్టోర్ వద్ద లేదా ఆన్‌లైన్‌లో ఆస్వాదించడానికి సిద్ధం కండి. నేడు వైజాగ్‌లో స్పెన్సర్స్ నూతన స్టోర్‌ను ద్వారకా నగర్, రవీంద్రభారతి స్కూల్ ఎదురుగా ప్రారంభించారు. వైజాగ్‌లో స్పెన్సర్స్‌కు ఇది 11వ స్టోర్.