గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:09 IST)

నవరాత్రులు.. నలుపు రంగు దుస్తులొద్దు.. ఎరుపు రంగు పువ్వుల్ని?

దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం. శరన్నవరాత్రుల్లో నిర్వహించే పూజల వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కొలువుదీరుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. 
 
నవరాత్రుల్లో కొన్ని పనులు చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఈ సమయంలో నలుపు రంగు శుభప్రదంగా పరిగణించరు. అలాగే, తల్లి దుర్గా ఆరాధన, అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూజగది అలంకరణ లేత రంగుల్లో ఉండాలి. ఇది కాకుండా ఎరుపు రంగు పూవులను కూడా ఉపయోగించవచ్చు.
 
నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక పనులు చేయాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్‌ గుర్తు పెట్టాలి. ఇది ఆ ఇంటికి సంతోషాన్ని తీసుకురావడంతోపాటు జీవితంలో అడ్డంకులను దుర్గామాత తొలగిస్తుంది.
 
ఇంటి ప్రధాన ద్వారం గడపకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇది ఆ ఇంటికి మంచిది. ఇంట్లోని నెగిటీవ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. నవరాత్రి సమయంలో ఈ పని తప్పక చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.