శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (19:03 IST)

ఉత్తర దిశలో క్యాష్ బాక్స్.. నెలవారీ సరుకులు పెడితే?

ఉత్తర దిశ బాగుంటే.. అంతా బాగుంటుంది. అక్కడ డబ్బులు పెట్టుకుంటే.. నిధి పెరుగుతుంది. నగలు పెట్టుకోవచ్చు, విలువైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరంపైపున బాత్‌రూంలు కట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. నిజానికి ఉత్తరం జలస్థానం అంటారు. ఇలా జలతత్వం దగ్గర అగ్నితత్వం పెట్టినా.. అది కూడా తప్పు అవుతుంది.
 
పూర్వం వాయువ్య దివలో కూడా బంఢాగారం ఏర్పాటు చేసుకునేవారు. అందుకే ఈ దిశలో బియ్యం డబ్బాను వాయువ్యంలో పెట్టుకోవాలి. వాస్తు కలర్‌రూపంలో కూడా ప్రభావితం చెందుతుంది. అందుకే ఈ దిశగా ఎరుపు రంగు వేసుకోకూడదు. దక్షిణ నైరుతిలో తెలియకుండా.. ఏవైనా డబ్బులు పెడితే.. ఖర్చులు పెరుగుతాయి.
 
డబ్బులు ఎప్పుడైనా ఉత్తర స్థానంలోనే పెట్టుకోవాలి అంటారు. దీంతో మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరుగుతుంది. అందుకే నెలవారీ సరుకులు తెచ్చుకున్నా వాయువ్య దిశలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఈ వాయువ్య చక్కగా పెట్టుకుంటే చక్కటి ఫలితాలు లభిస్తాయి. అందుకే ఈ దిశలో వాటర్‌కు సంబంధించిన వస్తువులు కూడా పెట్టుకోకూడదు. ఇక కుబేరుడి స్థానంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో సరుకులు, డబ్బులు పెట్టుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.