శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:54 IST)

వర్షాకాలంలో జలుబుకు చెక్ పెట్టే పెప్పర్ చికెన్ ఎలా చేయాలి

వర్షాకాలంలో జలుబు, దగ్గు అందరినీ వేధించే సమస్య. జలుబును, దగ్గును దూరం చేసుకోవాలంటే.. డాక్టర్ల వద్దకెళ్లి ఇంగ్లీష్ మందులకు డబ్బులు పెట్టడం కంటే.. ఇంట్లోనే పోషకాహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూ

వర్షాకాలంలో జలుబు, దగ్గు అందరినీ వేధించే సమస్య. జలుబును, దగ్గును దూరం చేసుకోవాలంటే.. డాక్టర్ల వద్దకెళ్లి ఇంగ్లీష్ మందులకు డబ్బులు పెట్టడం కంటే.. ఇంట్లోనే పోషకాహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబును బేష్‌గా పొగొట్టడంలో పెప్పర్ చికెన్ సూపర్‌గా పనిచేస్తుంది. ఈ వంటకాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు నయమవుతుంది. అలాంటి పెప్పర్ చికెన్ ఎలా చేయాలంటే..? 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ - అరకేజీ 
మిర్చి పౌడర్ - ఒక స్పూన్ 
పసుపు  పొడి - అర టీ స్పూన్ 
మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు 
ఉల్లి తరుగు - ఒక కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా చికెన్‌కు ఉప్పు, పసుపు చేర్చి ఐదు నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కనబెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్‌లో కాసింత ఉప్పు, మిర్చి పౌడర్, నీటిని చేర్చి ఉడికించుకోవాలి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికితే సరిపోతుంది. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె పోసుకోవాలి. అందులో ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. ఆపై ఉడికించిన చికెన్‌ను చేర్చి.. పసుపు పొడి, ఉప్పు చేర్చి బాగా డ్రై అయ్యేదాకా స్టౌమీద ఉంచాలి. బాగా డ్రై అయ్యాక మిరియాల పొడి చేర్చి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించేయాలి. అంతే పెప్పర్ చికెన్ రెడీ.