శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 24 జూన్ 2015 (18:06 IST)

20వ తానా మహాసభల అలంకరణ విభాగం

తానా మహాసభల ప్రధాన వేదిక, ధింతానా వేదిక, సభా ప్రాంగణంలో కళారూపాలను, ఆకృతులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది, ఈ సభలకు విచ్చేసిన తెలుగువారి హృదయాల్లో మరపురాని తీపిగుర్తులుగా మిగిలిపోయే విధంగా సభా అలంకరణ విభాగం నిర్విరామంగా కృషి చేస్తున్నది. 
 
తెలుగు వారి వైభవాన్ని చాటి చెప్పే రీతిలో సృజనాత్మకతతో తీర్చిదిద్దబడిన కళారూపాలతో, అన్ని హంగులతో ఈ 20వ మహా వేదిక రూపుదిద్దుకుంటోంది. ఈ అలంకరణ విభాగానికి శ్రీవాణి కోనేరు చైర్‌పర్సన్‌గా, రేఖ తాతినేని మరియు జ్యోతి మారుపుడి కో-చైర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
 
వీరి ఆధ్వర్యంలో వేదిక అలంకరణ పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఈ సారి డిట్రాయిట్ మహాసభలకు వచ్చిన వారందరూ మహాసభల వేదికను చూసి మంత్రముగ్ధులవుతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.