బుధవారం, 29 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified శుక్రవారం, 31 డిశెంబరు 2021 (20:48 IST)

నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేలా డిన్నర్ మీట్ అండ్ గ్రీట్

టెంపాబే నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేందుకు నాట్స్ టెంపా బే విభాగం మీట్ అండ్ గ్రీట్ పేరుతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టెంపాబేలో రోజు రోజుకి నాట్స్‌కు పెరుగుతున్న ఆదరణ అంతా... నాట్స్ తమదని భావించి ముందుకొస్తున్న వాలంటీర్లదేనని ఈ సందర్భంగా టెంపాబే నాయకత్వం వాలంటీర్లను ప్రశంసించింది.

 
ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వరంగల్ ఓయాసిస్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరన్ జ్యోతి నాట్స్ సేవలను కొనియాడారు. నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలు మధ్య అనుబంధాలు, బాధ్యతలు ఎలా ఉండాలనే దానిపై కూడా చక్కటి దిశా నిర్దేశం చేశారు. టెంపాబేలో సాటి తెలుగువారి కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్న నాట్స్ వాలంటీర్లను నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సత్కరించారు.

 
దాదాపు 100 మందికి పైగా తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని నాట్స్‌ కుటుంబ బలాన్ని చాటారు. నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్ ప్రసాద్ అరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో ఆర్డినేటర్  సురేశ్ బొజ్జ తదితరులు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.