Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు... ఆరోగ్యం, జీవనశైలి మార్పులపై సూచనలు

Updated: శనివారం, 15 జూన్ 2019 (18:24 IST)
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెంపాలో తెలుగువారి కోసం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ సదస్సుకు విచ్చేసి తమ ఆరోగ్యం గురించి ఎన్నో విలువైన అంశాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండాలంటే ఎలా అనే దానిపై స్థానిక ప్రముఖ వైద్యులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. 
 
గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర శాస్త్రి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను ఆదిలోనే గుర్తించవచ్చని డాక్టర్ అనిత కొల్లి తెలిపారు. 
 
ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నవీన వింధ్య చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నాట్స్ టెంపా బే చాప్టర్ కో-ఆర్డినేటర్ రాజేష్ కుండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య అవగాహన సదస్సును నాట్స్ వాలంటీర్ల చక్కగా తమ సహాయసహకారాలు అందించి విజయవంతం చేశారు.


నాట్స్ బోర్డు సభ్యులు ప్రశాంత్ పిన్నమ్మనేని, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు నిర్వహణకు కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రత్యేకంగా అభినందించారు.

అన్నీ చూడండి

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం : పవన్ కళ్యాణ్

ఇబ్బందుల్లో చిత్తూరు మామిడి రైతులు.. బకాయిల కోసం ఎదురుచూపులు

లండన్‌లో ఉద్యోగాలంటూ మోసం, ప్రముఖ యూ ట్యూబర్ నందన అరెస్ట్

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుంటే.. మీరు అవుట్‌డేటెడ్.. ఏపీ సీఎం చంద్రబాబు

కేవలం రెడ్డి, కమ్మ వర్గాలే రాష్ట్రాన్ని ఏలుతారా? మిగిలిన వర్గాలకు ఆ అర్హత లేదా? విజయసాయిరెడ్డి

అన్నీ చూడండి

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

Akhil Akkineni: ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలి : అఖిల్ అక్కినేని

తర్వాతి కథనం
Show comments