శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 31 మే 2017 (16:09 IST)

లండన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది సంబరాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా లండన్‌లో ఉస్మానియా పూర్వవిద్యార్థుల వేదిక జులై 9వ తేదీ భారీస్థాయిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ రంగుల సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జమ్ముల మహేష్‌లు పత్రికా ప్రకటన

ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా లండన్‌లో ఉస్మానియా పూర్వవిద్యార్థుల వేదిక జులై 9వ తేదీ భారీస్థాయిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ రంగుల సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి  జమ్ముల మహేష్‌లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 
 
కార్యక్రమం విద్యాభివృద్ధిలో ప్రవాసుల పాత్ర అంశం, ఉస్మానియా నుండి మరియు వివిధ రంగాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డ  ఉస్మానియా పూర్వ విద్యార్థుల అమూల్య సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీటితో పాటు ఉస్మానియా చారిత్రిక ఘట్టాలు జ్ఞాపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
ఉస్మానియా వైస్ ఛాన్సలర్‌తో పాటు ఉస్మానియాలో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయిలో ఉన్న వివిధ రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన వారిని ఆహ్వానిస్తున్నట్లు శతాబ్ది ఉత్సవాల కన్వీనర్లు మంగళగిరి సురేష్, గంప వేణుగోపాల్, సభ్యులు తుకారాం, మీనాక్షి అంతటి, ఫారూఖ్, గుండా శ్రీనివాస్, శ్యామ్ కుమార్ పిట్ల తెలిపారు.