అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమక్షంలో స్వామి గౌడ్ పుట్టిన రోజు వేడుకలు

అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 5 డెట్రాయిట్): ప్రధమ తెలంగాణ మహాసభలకు విచ్చేసిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ తమ పుట్టినరోజుని ఆటా సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. గోరటి వెంకన్న, రామాచారి, చంద్రబోస్ తదితరులు కూడా హాజరై స్వామి

swamigoud-birth day
ivr| Last Modified బుధవారం, 6 జులై 2016 (20:44 IST)
అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 5 డెట్రాయిట్): ప్రధమ తెలంగాణ మహాసభలకు విచ్చేసిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ తమ పుట్టినరోజుని ఆటా సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. గోరటి వెంకన్న, రామాచారి, చంద్రబోస్ తదితరులు కూడా హాజరై స్వామి గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఆటా ప్రెసిడెంట్ రాంమోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత ఇతర సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో కేక్ కటింగ్, భోజనాలు జరిగాయి. కేక్ కటింగ్ అవగానే అందరూ జై తెలంగాణ నినాదాలు చేశారు. స్వామి గౌడ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆటా సభ్యులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.దీనిపై మరింత చదవండి :