తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో ఆటల పోటీలు

TAGS
ivr| Last Modified సోమవారం, 18 జనవరి 2016 (13:50 IST)
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో శాక్రమెంటో శివారు నగరం రాంచో కార్దోవలో నార్త్ కాలిఫోర్నియా బాడ్మింటన్ క్లబ్ క్రీడా ప్రాంగణంలో శనివారం జనవరి 9, 2016 న ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో శివారు నగరాలకు చెందిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున పలు ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఆటలో గెలిచి తీరాలన్న లక్ష్యమే వారిని విజేతలుగా నిలిపింది. 
 
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో పిల్లలు, పెద్దలు పాల్గొని  సత్తా చాటారు. ఈ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ నాగం ప్రారంభించారు. శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, దుర్గ చింతల, మల్లిక్ సజ్జనగాండ్ల, కీర్తి సురం, గిరి టాటిపిగారి, అశ్విన్ తిరునాహరిల పర్యవేక్షణలో చదరంగం, తెలుగు ప్రశ్నావళి, తెలుగు కథ చెప్పడం, క్యారమ్స్, గాలిపటాల తయారీ, చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 
 
కాలిఫోర్నియా శాక్రమెంటోలో TAGS ఆటల పోటీలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ చైర్మన్ వాసు కుడుపూడి, అధ్యక్షులు వెంకట్ నాగం, కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, వనిత ఆలపాటి,  రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, అబ్దుల్ షైక్, దుర్గా సాయి చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, భాస్కర్ దాచేపల్లి, కీర్తి సురం తదితరులతోపాటు TAGS కార్యకర్తలు ఉన్నారు. 
 
చదరంగం పోటీల నిర్వహణకు విశేష సహకారం అందించిన చదరంగం గురు "బ్రహ్మ మొహంతి" కు, తెలుగు కధ చెప్పడం పోటీ  ని ప్రోత్సహించిన వంశీ మాగంటి కు  TAGS కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక "చికాగో పిజ్జా విత్ ఎ ట్విస్ట్" రెస్టారెంట్ వారు అందించిన నోరూరించే ఇండియన్  పిజ్జాలు అందరినీ అలరించాయి. విజేతల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ నాగం  ప్రకటించారు. విజేతలకు జనవరి 30, 2016 న జరుగబొనున్న TAGS 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 
 
అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక కళాకారులు, మరియు పలు జానపద కళాకారులు సంక్రాంతి వేడుకల ప్రాంగణంను తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. స్థానిక ఫోల్సోం నగరంలో ఉన్న ఫోల్సోం హైస్కూల్ ధియేటర్లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబారాలు మొదలయ్యి, రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు 250 మందికి పైగా స్థానిక కళాకారులు సంసిద్ధులు అవుతున్నారు. 
 
ఈ సందర్భంగా జానపద కళా రూపాల జాతరతో ప్రేక్షకులను అలరింప జేయడానికి శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరుగునపడిన కళల వికాసానికి శాక్రమెంటో తెలుగు సంఘం చేస్తున్న సాంస్కృతిక కృషి కి అందరు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. TAGS సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు sactelugu.org లేదా facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా [email protected]కు ఈమెయిలులో సంప్రదించాలని ఈ సందర్భంగా TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.దీనిపై మరింత చదవండి :