బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (21:32 IST)

మాటలు నేర్చిన మా నరజాతి మారణహోమం సాగించేను( వీడియో)

భక్త తుకారం చిత్రంలోని బలే బలే అందాలు సృష్టించావనే పాటను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు, అంజలీ దేవి నటించారు. ఈ పాటకు సంగీతం: పి. ఆదినారాయణ రావు, రచన: వీటూరి. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వర రావు.
 
నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలీ... 
మరచితివో మానవజాతి దయమాలి
 
బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
 
చరణం 1
మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలిసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు.... |బలే|
 
చరణం 2
చల్లగ సాగే సెలయేటివోలె
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలె
అందరు ఒక్కటై నివశించాలి
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి... |బలే|

పాట వీడియో- యూ ట్యూబ్ నుంచి...