జనవరిలో పుట్టిన వారికి వంకాయ రంగు కలిసొస్తుందా?
జనవరిలో పుట్టిన వారు మంచి ఆలోచనాపరులు. వీరి ఆలోచనలు చాలావరకు కలిసివస్తాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తిసామర్థ్యాలు కలిగి వుంటారు. వాదనలో ఘటికులు. ఎలాంటివారినైనా మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనలో దిగడం అంటే ఓటమిని అంగీకరించటమే. వీరు సున్నిత మనస్కులు. చిన్నవయస్సులోనే విద్యలో ఆటంకాలు ఎదురైనా రాణిస్తారు. వీరికి ధైర్యసాహసాలెక్కువ. చాలామటుకు ధనవంతులై వుంటారు. ధనవంతులవుతారు. సత్కార్యాలు చేస్తారు.
ఈ నెలలో పుట్టిన వారికి చాలావరకు మకర రాశి వారికి వుండే ఫలితాలు వుంటాయి. జనవరిలో పుట్టిన స్త్రీపురుషులు చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా వుంటారు. వీరిలో కొందరు ఇతరులను నమ్మటం ద్వారా ధననష్టం తప్పదు. అయినా ఆర్థిక ఇబ్బందులు వుండవు. వ్యాపారంలో రాణిస్తారు. చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు. స్థిరాస్తులు సంపాదిస్తారు.
కానీ నష్టాన్ని భరించలేరు. కాబట్టి పూర్తిగా భద్రత వున్న వ్యాపారాలనే చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వీరికి బుధ, శుక్ర కలిసొస్తాయి. వంకాయ రంగు, నలుపు వీరికి అదృష్టాన్నిస్తాయి.